Sports

మరో టైటిల్ ను తనఖాతాలో వేసుకున్న పీవీ సింధు

Telugu

తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచిన సింధు ఇప్పుడు ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌లో విజేతగా నిలిచింది.ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ 2017 ఫైనల్ మ్యాచ్‌లో తెలుగు తేజం పీవీ సింధూ ఘన విజయం సాధించింది. తన కెరీర్‌లో తొలి ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచింది. సింధూ కెరీర్‌లో ఇది రెండో సూపర్ సిరీస్ టైటిల్ కాగా ఓవరాల్‌గా తొమ్మిదొవ టైటిల్.

Share

ధోనీ గురించి చేదు వార్త ! అదేమిటో మీరు చూడండి.....

Telugu

మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు చెబితే క్రికెట్ అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ధోనీ బ్యాట్ పట్టుకుని క్రీజులోకి రాగానే అభిమానుల కళ్లన్నీ అతడిపైనే ఉంటాయి. కెప్టెన్ కూల్‌గా పేరున్న ధోనీ ఇటీవల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ వార్తే క్రీడాభిమానులను ఎంతో నిరాశకు గురిచేసింది. మరి ధోనీ ఏకంగా క్రికెట్‌కే దూరమైపోతే. ఇంటర్నేష్నల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని మహీ ప్రకటిస్తే!!.. ఇంకేమైనా ఉందా?.. ధోనీ అభిమానుల హార్ట్ బ్రేక్ అయిపోదూ!

Share

అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న కోహ్లీ సేన, ఐసీసీ భారీ నజరానా

Telugu

ఆస్ట్రేలియాపై సెకండ్ టెస్ట్ నెగ్గిన కోహ్లీ సేన టెస్టుల్లో తన టాప్ ర్యాంక్‌ను పదిలం చేసుకుంది. ఏప్రిల్ 1కి టెస్టుల్లో అగ్ర స్థానంలో ఉన్న జట్టుకు ఐసీసీ ప్రతి ఏటా ప్రైజ్ మనీ ఇస్తుంది. ఈసారి పది లక్షల డాలర్లను(6 కోట్ల 70 లక్షలు) టీమిండియాకు అందించనుంది. దాంతో పాటు ఛాంపియన్ గదను కూడా బహూకరించనుది. ప్రస్తుత ర్యాంకిగ్ ప్రకారం భారత్ 121 పాయింట్లతో టాప్‌లో ఉండగా, ఆస్ట్రేలియా జట్టు 109 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

Share

అతనిపై కోహ్లీకి కోపం వచ్చి ఏం చేశాడంటే..

Telugu

టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి కోపం మామూలుగా రాలేదు. ఆ ఆటగాడి పద్ధతిపై కోహ్లీ కన్నెర్ర చేశాడు. గుడ్లురిమి చూస్తూ అతనికి దగ్గరగా వెళ్లాడు. 22వ ఓవర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన‌ స్టేడియంలో వేడి పుట్టించింది. అశ్విన్ బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ స్మిత్ స్ట్రయిట్ డ్రైవ్ చేశాడు. బాల్ ఆపడానికి అశ్విన్‌కు అవకాశం ఇవ్వకుండా నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న రెన్‌షా అడ్డుగానే నిలబడ్డాడు. బంతి అతన్ని దాటి వెళ్లాక సింగిల్ రన్ చేశారు.

Share

తల్లీ కూతుళ్ల బౌలింగ్.. తండ్రి బ్యాటింగ్..

Telugu

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ తన కూతురు అయిరా షమీతో సంతోషంగా గడుపుతున్నాడు. అయిరా బౌలింగ్ చేస్తుంటే తాను బ్యాటింగ్ చేశాడు. తల్లి హసీం జహాన్ చిన్నారి కూతురితో బౌలింగ్ వేయిస్తుంటే తండ్రి మహ్మద్ షమీ బ్యాటింగ్ చేస్తూ ఆస్వాదించాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ సమయంలో అయిరా అస్వస్థతకు గురైంది. రోజూ మ్యాచ్ ముగిసిన అనంతరం ఐసీయూలో ఉన్న కూతురిని చూసేందుకు వెళ్లేవాడు షమీ.

Share

ఆ ఇద్దరు ఆటగాళ్లను పక్కన పెట్టడానికి కారణంఏమిటి?

Telugu

టెస్ట్ మ్యాచుల్లో అద్భుతంగా రాణించినా, వన్డేల్లో మాత్రం నిరాశపరిచారని వారిద్దరినీ భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగబోయే టి20 మ్యాచ్‌లకు దూరంపెట్టారు. బౌలర్ ఆర్ అశ్విన్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు తాత్కాలికంగా టి20 మ్యాచ్‌లకు విరామం ఇచ్చి వీరి స్థానంలో అమిత్ మిశ్రాకు, పర్వేజ్ రసూల్‌కు అవకాశం కల్పించారు. త్వరలో భారత్ ఆస్ట్రేలియాతో టెస్టులు, టి20 మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో పాత ఆటగాళ్లకు కాస్త విరామమిచ్చి కొత్త ఆటగాళ్లతో ప్రయోగాలు చేసేందుకు బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Share

సింధుకి బ్యాడ్మింటన్ పై ఆసక్తి ఎలా కలిగింది?

Telugu

సింధు తండ్రి రమణ సింధు గురించి కొన్ని విషయాలు తెలియజేసారు. పిల్లల్లో ఎదో ఒక ఆసక్తి ఉంటుంది వారి ఆసక్తిని మనం గమనించాలి ఎనిమిదేళ్ళ వయసులో సింధు బ్యాడ్మింటన్ పై ఆసక్తి చూపేది, నేను, నా స్నేహితులు వాలిబాల్ ఆడుతుండేవాళ్ళం. మాతో పాటు వాలిబాల్ కోర్టుకు వచ్చిన సింధు ఆ పక్కనే ఉన్న బ్యాడ్మింటన్ కోర్టులో ఆట ప్రారంభించేది తరువాత గోపి దగ్గరకు శిక్షణకు వెళ్ళింది. ఆ తరువాత సింధు సాధించిన విజయం మీకుతెలుసు.

Share

నేనిక అమెరికా ఆటగాడిని అంటున్నభారతీయ క్రీడాకారుడు

Telugu

ఏ కళా రంగానికయినా ఆదరణ లేకపోతే క్రీడాకారులు ఎదుర్కుంటున్న సమస్యలు అధికారులు పట్టించుకోకపోతే, వారికీ ఆదరణ లేకుంటే, ప్రోస్తాహకాలు అందకపోతే అప్పుడు మనం వారిని పోగొట్టుకోవలసి వస్తుంది. జమీల్‌ పఠాన్‌ ఖాన్‌. తెలంగాణకు చెందిన అంతర్జాతీయ కరాటే మాస్టర్‌. కుంగ్‌ఫూలోనూ ఆరితేరిన మొనగాడు. కటిక పేదరికంలో పుట్టిన అతను 16 ఏళ్లలో దాదాపు యాభై అంతర్జాతీయ పతకాలు సాధించాడు. కటిక పేదరికం వలన కుటుంబ పోషణార్ధం ఒక ఇల్లు, ఒక ఉద్యోగం ఇప్పించవలసిందిగా ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు.

Share