దాసరి సినిమాకు వందనం.. అభివందనం!

Telugu

దాసరి నారాయణరావు లేరు. కానీ ఆయన తీసిన సినిమాలున్నాయి. తన సినిమాలతో ‘దర్శకరత్న’గా పేరుపొందిన ఆయన, చిత్రసీమ అంతటికీ గురువుగా మారిన వైనం అనితర సాధ్యం. ఆయనకు ముందు ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు. తమ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని చాటారు. ఆయన సమకాలికుల్లోనూ, ఆయన తర్వాతి తరాల్లోనూ ప్రతిభావంతులైన దర్శకులు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లెవరికీ దక్కని గురువు స్థానం ఆయనకే దక్కింది. దర్శకుడిగా ఎంత ఉన్నతుడో, వ్యక్తిత్వపరంగా అంత ఉన్నతుడు కావడమే దీనికి కారణం. ఆయన రూపొందించిన 150 చిత్రాల్లో ఉత్తమ చిత్రాలెన్నో.

దర్శక రత్న దాసరి నారాయణరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. బుధవారం ఫిలిం ఛాంబర్ నుంచి ర్యాలీగా తీసుకువచ్చిన దాసరి భౌతిక కాయాన్ని మొయినాబాద్‌ తోల్కట్ట ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. దాసరి పెద్ద కుమారుడు తారక ప్రభు చితికి నిప్పుపెట్టారు. ఈ అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

Share