అఖిల్‌ మాజీ ప్రేయసికి పెళ్లి ఖాయమైందా?

Telugu

చాలా చిన్న వయసులోనే అక్కినేని అఖిల్‌ తన కంటే పెద్దదైన జీవీకే మనవరాలు శ్రీయభూపాల్‌తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా లభించడంతో పెళ్లి చేసుకోవడానికి సిద్దపడి నిశ్ఛితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఏమైందో ఉన్నట్టుండి వారి పెళ్లి క్యాన్సిల్‌ అయిందని వార్తలు బయల్దేరాయి. అఖిల్‌-శ్రీయ బ్రేకప్‌ గురించి నెల రోజుల క్రితమే వార్తలు వచ్చినా.. ఇప్పటివరకు ఆ విషయం గురించి ఇరు కుటంబసభ్యులలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ఆ వార్తను ఖండించకుండా, ఆమోదించకుండా అందరూ సైలెన్స్‌ మెయింటెన్‌ చేస్తున్నారు. కాగా, ఇప్పుడు శ్రీయభూపాల్‌ గురించి మరో వార్త బయటకు వచ్చింది. శ్రీయకు ఓ ఎన్నారై వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందన్నదే ఆ వార్త. మరి, ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ, అఖిల్‌ రెండో సినిమా ప్రారంభమైన రోజే ఈ వార్త బయటకు రావడం గమనార్హం. టాలీవుడ్‌లో పలువురు సెలబ్రిటీలకు డిజైనర్‌గా పనిచేసిన శ్రీయ.. తన కుటుంబ సభ్యులు చూసిన సంబంధానికి ఓకే చెప్పేసినట్టు సమాచారం. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో కొన్ని రోజులు ఆగితే గాని తెలియదు.

Share