మరో టైటిల్ ను తనఖాతాలో వేసుకున్న పీవీ సింధు

Telugu

తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచిన సింధు ఇప్పుడు ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌లో విజేతగా నిలిచింది.ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ 2017 ఫైనల్ మ్యాచ్‌లో తెలుగు తేజం పీవీ సింధూ ఘన విజయం సాధించింది. తన కెరీర్‌లో తొలి ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచింది. సింధూ కెరీర్‌లో ఇది రెండో సూపర్ సిరీస్ టైటిల్ కాగా ఓవరాల్‌గా తొమ్మిదొవ టైటిల్. రియో ఓలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసి ప్రతీకారం తీర్చుకుంది. మొదటి సెట్‌ను 21-19తో నెగ్గిన సింధూ సెకండ్ సెట్‌ను 21-16తో గెలిచి సత్తా చాటింది. దీంతో సింధూ ఇండియా ఓపెన్ డ్రీమ్‌ను నెరవేర్చుకుంది. ప్రస్తుతం ఐదో ర్యాంక్‌లో ఉన్న సింధూ అగ్ర స్థానం దిశగా దూసుకెళుతోంది.

Share