అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న కోహ్లీ సేన, ఐసీసీ భారీ నజరానా

Telugu

ఆస్ట్రేలియాపై సెకండ్ టెస్ట్ నెగ్గిన కోహ్లీ సేన టెస్టుల్లో తన టాప్ ర్యాంక్‌ను పదిలం చేసుకుంది. ఏప్రిల్ 1కి టెస్టుల్లో అగ్ర స్థానంలో ఉన్న జట్టుకు ఐసీసీ ప్రతి ఏటా ప్రైజ్ మనీ ఇస్తుంది. ఈసారి పది లక్షల డాలర్లను(6 కోట్ల 70 లక్షలు) టీమిండియాకు అందించనుంది. దాంతో పాటు ఛాంపియన్ గదను కూడా బహూకరించనుది. ప్రస్తుత ర్యాంకిగ్ ప్రకారం భారత్ 121 పాయింట్లతో టాప్‌లో ఉండగా, ఆస్ట్రేలియా జట్టు 109 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆసిస్‌పై మొదటి టెస్ట్ మ్యాచ్ గనక కోహ్లీ సేన గెలిచి ఉంటే ఆ సమయానికే ఈ నజరానా డిసైడ్ అయ్యేది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ నెగ్గినా ఏప్రిల్ ఒకటి నాటికి టెస్టుల్లో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో సెకండ్ టెస్ట్ నెగ్గి అదరగొట్టింది భారత జట్టు.

Share