తల్లీ కూతుళ్ల బౌలింగ్.. తండ్రి బ్యాటింగ్..

Telugu

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ తన కూతురు అయిరా షమీతో సంతోషంగా గడుపుతున్నాడు. అయిరా బౌలింగ్ చేస్తుంటే తాను బ్యాటింగ్ చేశాడు. తల్లి హసీం జహాన్ చిన్నారి కూతురితో బౌలింగ్ వేయిస్తుంటే తండ్రి మహ్మద్ షమీ బ్యాటింగ్ చేస్తూ ఆస్వాదించాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ సమయంలో అయిరా అస్వస్థతకు గురైంది. రోజూ మ్యాచ్ ముగిసిన అనంతరం ఐసీయూలో ఉన్న కూతురిని చూసేందుకు వెళ్లేవాడు షమీ. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కోలుకుని హాయిగా ఆడుకుంటున్న కూతుర్ని సంతోష పెట్టేందుకు తల్లిదండ్రులు కలిసి ఆడటం ఎంతో ఆకట్టుకుంది.

Share