Movies

కులపిచ్చి అభిమానికి ఘాటు రిప్లై ఇచ్చిన నాని!

Telugu

ప్రస్తుతం రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో కులపిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక హీరో సినిమా విడుదలైందంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన అభిమానులు చేసే హడావిడి అంతాఇంతా కాదు. తాజాగా హీరో నానిపై ఓ వ్యక్తి కులం గురించి అభియోగాలు మోపాడు. ఇటీవల స్వర్గీయ ఎన్టీయార్‌ జన్మదినం సందర్భంగా నాని ఓ ట్వీట్‌ పెట్టారు. ‘దేవుడికి తమ జన్మదినోత్సవం ఎప్పుడో స్పష్టంగా తెలియనపుడు వారు ఈ రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవచ్చ’ని నాని ట్వీట్‌ చేశారు.

Share

దాసరి సినిమాకు వందనం.. అభివందనం!

Telugu

దాసరి నారాయణరావు లేరు. కానీ ఆయన తీసిన సినిమాలున్నాయి. తన సినిమాలతో ‘దర్శకరత్న’గా పేరుపొందిన ఆయన, చిత్రసీమ అంతటికీ గురువుగా మారిన వైనం అనితర సాధ్యం. ఆయనకు ముందు ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు. తమ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని చాటారు. ఆయన సమకాలికుల్లోనూ, ఆయన తర్వాతి తరాల్లోనూ ప్రతిభావంతులైన దర్శకులు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లెవరికీ దక్కని గురువు స్థానం ఆయనకే దక్కింది. దర్శకుడిగా ఎంత ఉన్నతుడో, వ్యక్తిత్వపరంగా అంత ఉన్నతుడు కావడమే దీనికి కారణం.

Share

అఖిల్‌ మాజీ ప్రేయసికి పెళ్లి ఖాయమైందా?

Telugu

చాలా చిన్న వయసులోనే అక్కినేని అఖిల్‌ తన కంటే పెద్దదైన జీవీకే మనవరాలు శ్రీయభూపాల్‌తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా లభించడంతో పెళ్లి చేసుకోవడానికి సిద్దపడి నిశ్ఛితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఏమైందో ఉన్నట్టుండి వారి పెళ్లి క్యాన్సిల్‌ అయిందని వార్తలు బయల్దేరాయి. అఖిల్‌-శ్రీయ బ్రేకప్‌ గురించి నెల రోజుల క్రితమే వార్తలు వచ్చినా.. ఇప్పటివరకు ఆ విషయం గురించి ఇరు కుటంబసభ్యులలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

Share

నయన్‌ ఇకముందు బాలీవుడ్ లో నటించనుందా!

Telugu

దక్షిణాదిన అమ్మడి క్రేజ్ చూసి మురిసిపోయిన ఆ బాలీవుడ్ బిగ్ షాట్.. ఉన్నట్లుండి ఆమెకు ఎర్ర తివాచీ పరిచేసి మరీ ఆహ్వానం పలుకుతున్నాడట. ఇంతకూ ఇంత గౌవరం అందుకున్న ఆ సుందరాంగి ఎవరంటే.. నయనతార. టోటల్ సౌత్ ఇండస్ట్రీకే లేడీ సూపర్ స్టార్‌గా జెండా ఎగరేస్తున్న అందాల తార నయనతార.. ప్రస్తుతం కోలీవుడ్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తోందన్న సంగతి తెలిసిందే.

Share

మరో వివాదంలో ధనుష్‌... వకాల్తాలో ఫోర్జరీ సంతకం

Telugu

తమిళ నటుడు ధనుష్‌ ఎవరి కుమారుడో నిర్ధారించాలని దాఖలైన కేసు విచారణ ముగియకముందే, వకాల్తాలో ఫోర్జరీ సంతకం చేసినట్లు ఆయనపై మరో ఆరోపణ నమోదైంది. వకాల్తా పత్రాల్లో ఆయన ఫోర్జరీ సంతకానికి పాల్పడ్డారంటూ న్యాయవాది న్యాయస్థానానికి ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. మదురై జిల్లా మేలూరు సమీపంలో మలంపట్టి గ్రామానికి చెందిన కదిరేశన, మీనాక్షి దంపతులు ధనుష్‌ తమ కుమారుడేనని, అతని నుంచి తమకు జీవనభృతి ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ మేలూరు కోర్టులో గత డిసెంబర్‌లో పిటీషన దాఖలు చేశారు.

Share

హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు !

Telugu

సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ సంస్కృతి చాలా ఎక్కువని, అవకాశాల కోసం లొంగిపోక తప్పదని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అర్చన, మాధవీలత, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, కస్తూరి, రాధికా ఆప్టే వంటి హీరోయిన్లు ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించిన సంగతీ తెలిసిందే. తాజాగా మలయాళ నటి పార్వతి మీనన్ కూడా తనకు ఎదురైన అనుభవాల గురించి నోరు విప్పింది.

Share

అలియానే కావాలంటున్న అఖిల్!

Telugu

ఏ ముహూర్తాన అఖిల్ హీరోగా కెరీర్ ప్రారంభించాడో కానీ.. అతడి రెండో సినిమా ఇప్పటికీ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఏడాదిన్నర దాటిపోయిందిగానీ.. రెండో సినిమా ఏంటన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. స్టార్‌గా అతడి కెరీర్ గాడిలో పడేందుకు మాత్రం అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ముందే ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్.. తన ఫస్ట్ సినిమా అఖిల్‌తో మెప్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. అఖిల్ ఆ రేంజ్‌లో డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు మరి.

Share

దుమారం రేపుతున్న సంగీత దర్శకుడి మాటలు!

Telugu

‘బాహుబలి’ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించి అందరి చేతా మన్ననలు పొందిన సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి. అయితే ‘బాహుబలి-2’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు కొద్ది గంటల ముందు ఆయన చేసిన ట్వీట్లు విమర్శల పాలవుతున్నాయి. తెలుగులో బుర్ర తక్కువ దర్శకులు ఎక్కువని వ్యాఖ్యానించిన కీరవాణి.. తెలుగు గీత రచయితలపైనా తీవ్ర విమర్శలు చేశాడు. ‘వేటూరి సుందరరామ్మూర్తి చనిపోయిన తర్వాత, సిరివెన్నెల సీతారామశాస్ర్తి పాటలు రాయడం తగ్గించిన తర్వాత తెలుగు పాట అంపశయ్య ఎక్కింది’ అని కీరవాణి విమర్శించాడు.

Share

పవన్‌ కొత్త సినిమాలో విలన్ ఎవరో మీకు తెలుసా!

Telugu

పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాపై ప్రస్తుతం డివైడ్ టాక్ నడుస్తోంది. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. వెంటనే తదుపరి సినిమాలో జాయిన్ కాబోతున్నాడు పవర్ స్టార్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నాడు. ఏప్రిల్ 6 నుంచి సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. గత జూన్ నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు సంబంధించి స్టార్ కాస్ట్ ఇంకా ఏదీ తేలకపోయినా.. ఓ ఆసక్తికరమైన అంశం ఫిల్మ్‌నగర్‌లో హల్ చల్ చేస్తోంది.

Share

Pages