‘రెండు ఆకులు’ కాదు... పార్టీ పేరు కూడా మారింది...

Telugu

‘అమ్మ’ జయలలిత వారసత్వం కోసం పోరాడుతున్న శశికళ, పన్నీర్ సెల్వం ఎదురు దెబ్బ తిన్నారు. పార్టీ గుర్తు రెండు ఆకులు ఇరువురిలో ఒకరికైనా లేకుండా పోయింది. అదే విధంగా ఇరు వర్గాలకూ వేర్వేరు పార్టీల పేర్లు వచ్చాయి. అన్నా డీఎంకే ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలకు వేర్వేరు గుర్తులను కేటాయించింది. పార్టీ పేర్లను కూడా మార్చింది.

Share

జయ కొడుకును నేనే!: ఈరోడ్‌ కృష్ణమూర్తి

Telugu

తమిళనాడు మాజీ సీఎం జయలలిత కుమార్తెనంటూ కొద్దిరోజుల క్రితం ఓ యువతి హల్‌చల్‌ చేయగా.. ఇప్పుడు ఆమె కుమారుడిని తానేనంటూ ఈరోడ్‌కు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాడు. తానింత కాలం జయ స్నేహితురాలు వనితామణి ఇంట తన పెంపుడు తల్లిదండ్రులతోపాటు నివసించానని, 2016 సెప్టెంబరు 14న పొయస్‌ గార్డెన్‌కు వెళ్లానని, నాలుగు రోజులపాటు తన తల్లి జయతో అక్కడే ఉన్నానని అందులో పేర్కొన్నాడు.

Share

14 ఏళ్ల తర్వాత యూపీలో దుమ్ము దులిపిన బీజేపీ

Telugu

ఐదు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. నాలుగింట మూడొంతుల సీట్లు సాధించి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు దాదాపు దగ్గరపడిన వేళ గోవా, మణిపూర్‌లో కూడా కాంగ్రెస్‌తో హోరాహోరీగా పోరాడుతోంది. ఇక యూపీ విషయానికి వస్తే రెండున్నర దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఎస్పీ, బీఎస్పీలు ఏలాయి. దీంతో యూపీలో బీజేపీకి 14 సంవత్సరాలపాటు అధికారం అందని ద్రాక్షగా మారింది.

Share

నాకేదీ వారసత్వంగా రాలేదు

Telugu

ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వారసత్వ రాజకీయాలతో ఈ స్థాయికి వచ్చారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. తనకు ఏ పదవీ వారసత్వంగా రాలేదన్నారు. శనివారం వారణాసిలో భారీ రోడ్‌షో నిర్వహించిన ఆయన ఆదివారం కూడా పెద్ద ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘నాకేదీ వారసత్వంగా రాలేదు. కాశీ ప్రజల ఆశీర్వాదం వల్లే ఈ స్థితికి వచ్చాను. వారిద్దరూ చాలా బలహీనులు. కఠిన నిర్ణయాలు తీసుకోలేరు.

Share

తమిళనాట అసలేంజరుగుతుంది

Telugu

తమిళనాడులో జరుగుతున్న రాజకీయనాటకాలను చూసి ప్రపంచం మొత్తం ముక్కున వేలేసుకున్నారు. జయలలిత మరణించిన తరువాత మొన్నటి వరకు పన్నీర్‌ అన్నాడీఎంకే తరపున తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. శశికళ ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి పన్నీర్‌ ను పదవినుండి తొలగించి తనుఅవ్వాలని చూసారు, కాని అక్రమాస్తుల కేసులో అరెష్టుఅయ్యి జైలుకి వెళుతూ పళనిని తనునమ్మిన బంటుగా తనతరపున ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారు. అయితే పళని శనివారం అసెంబ్లీలో అనేక రాజకీయ, నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా ఎంపికఅయ్యారు.

Share

తమిళ రాజకీయ మలుపులకు ముగింపు

Telugu

తమిళనాట రాజకీయ డ్రామాకు తెరపడింది. ఎట్టకేలకు తమిళనాడు సీఎం ఎవరన్నది గవర్నర్ తేల్చేశారు. కొద్దిసేపటి క్రితం రాజ్‌భవన్‌‌లో సీఎంగా పళనిస్వామి ప్రమాణం చేశారు. ఇదంతా అటుంచితే సీఎంగా ప్రమాణం చేసిన పళని స్వామి ఇప్పుడే అసలు సిసలైన పరీక్ష పాస్ కావాల్సి ఉంది. సీఎంగా ప్రమాణం చేసినా ఆయన ఈ రెండు మూడురోజులు టెన్షన్ టెన్షన్‌‌గానే గడపనున్నారు. సోమవారం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ బలనిరూపణలో ఎవరు నెగ్గితే వారికే సీఎం పీఠం దక్కనుంది.

Share

తమిళనాడులో శపథాల పరంపర

Telugu

సీఎంగానే అసెంబ్లీలోకి అడుగుపెడతా ..ఇదీ దివంగత నేత, పురచ్చితలైవి జయలలిత ఒకప్పుడు చేసిన శపథం! అప్పట్లో ఆమె ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు!! మళ్లీ ఇప్పుడు అదే రీతిలో ఆమె నెచ్చెలి శశికళ కూడా శపథం చేసి మరీ అసెంబ్లీలో సీఎంగా అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. జయ మరణానంతరం తమిళనాడు సీఎం అయిన పన్నీర్‌సెల్వం.. ‘అమ్మ’ మృతికి అసెంబ్లీ సంతాపం తెలుపుతున్న తరుణంలో రావాల్సిందిగా శశికళకు సూచించారు. ఆ మేరకు ఆయన గ్యాలరీలో ఏర్పాట్లు కూడా చేయించారు.

Share

పాపం పన్నీర్‌సెల్వం పరిస్థితిఏమిటి?

Telugu

పాపం పన్నీర్‌సెల్వం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రత్యర్థుల నోట కూడా వినవస్తున్న మాట. అన్నాడీఎంకే కష్టకాలంలో వున్నప్పుడల్లా సీఎం పదవినెక్కి, పార్టీ అధినేత్రి కుదురుకున్నతరువాత పూలల్లో పెట్టి ఆ పదవిని అప్పగించిన విశ్వాసపాత్రుడిగా ఇప్పుడాయన రికార్డుల్లో నిలిచిపోనున్నారు. 2001 సెప్టెంబరు 21వ తేదీ నుంచి 2002 మార్చి 1వ తేదీ వరకు వరకు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. జయ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ పదవిని తిరిగి ఆమెకే భద్రంగా అప్పగించారు.

Share

నగదుతీసుకున్నవాడి పని అంతే సంగతలు!!!

Telugu

ఏప్రిల్ 1 వ తేది తరువాత మూడు లక్షల రూపాయలకు మించిన నగదు లావాదేవీలు చట్ట విరుద్ధం కానున్నాయి. ఆదాయ పన్ను చట్టంలో చేస్తున్న ఈ సవరణ ప్రధాన ఉద్ధేశం నగదు లావాదేవీలను నిరుత్సాహ పరచడమే. ముఖ్యంగా వస్తువును అమ్మేవాళ్లే పట్టుబట్టి నగదు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వాళ్లనే లక్ష్యంగా చేసుకొని చట్టం మారుస్తోంది. ఒకే లావాదేవీలో రూ.3 లక్షలకు మించి నగదు చేయి మారితే అది పుచ్చుకున్న వాడు చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది.

Share

Pages