గోమాతపై రాజస్థాన్ హైకోర్టు సంచలన పిలుపు

Telugu

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు బుధవారం సలహా ఇచ్చింది. ఆవును హత్య చేసినవారికి విధించే శిక్షా కాలాన్ని కూడా జీవిత ఖైదుకు పెంచాలని పిలుపునిచ్చింది. గోవుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ సలహాలిచ్చింది. ఇదిలావుండగా పశువధ, అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని మద్రాస్ హైకోర్టు నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

Share

కులపిచ్చి అభిమానికి ఘాటు రిప్లై ఇచ్చిన నాని!

Telugu

ప్రస్తుతం రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో కులపిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక హీరో సినిమా విడుదలైందంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన అభిమానులు చేసే హడావిడి అంతాఇంతా కాదు. తాజాగా హీరో నానిపై ఓ వ్యక్తి కులం గురించి అభియోగాలు మోపాడు. ఇటీవల స్వర్గీయ ఎన్టీయార్‌ జన్మదినం సందర్భంగా నాని ఓ ట్వీట్‌ పెట్టారు. ‘దేవుడికి తమ జన్మదినోత్సవం ఎప్పుడో స్పష్టంగా తెలియనపుడు వారు ఈ రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవచ్చ’ని నాని ట్వీట్‌ చేశారు.

Share

దాసరి సినిమాకు వందనం.. అభివందనం!

Telugu

దాసరి నారాయణరావు లేరు. కానీ ఆయన తీసిన సినిమాలున్నాయి. తన సినిమాలతో ‘దర్శకరత్న’గా పేరుపొందిన ఆయన, చిత్రసీమ అంతటికీ గురువుగా మారిన వైనం అనితర సాధ్యం. ఆయనకు ముందు ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు. తమ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని చాటారు. ఆయన సమకాలికుల్లోనూ, ఆయన తర్వాతి తరాల్లోనూ ప్రతిభావంతులైన దర్శకులు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లెవరికీ దక్కని గురువు స్థానం ఆయనకే దక్కింది. దర్శకుడిగా ఎంత ఉన్నతుడో, వ్యక్తిత్వపరంగా అంత ఉన్నతుడు కావడమే దీనికి కారణం.

Share

అఖిల్‌ మాజీ ప్రేయసికి పెళ్లి ఖాయమైందా?

Telugu

చాలా చిన్న వయసులోనే అక్కినేని అఖిల్‌ తన కంటే పెద్దదైన జీవీకే మనవరాలు శ్రీయభూపాల్‌తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా లభించడంతో పెళ్లి చేసుకోవడానికి సిద్దపడి నిశ్ఛితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఏమైందో ఉన్నట్టుండి వారి పెళ్లి క్యాన్సిల్‌ అయిందని వార్తలు బయల్దేరాయి. అఖిల్‌-శ్రీయ బ్రేకప్‌ గురించి నెల రోజుల క్రితమే వార్తలు వచ్చినా.. ఇప్పటివరకు ఆ విషయం గురించి ఇరు కుటంబసభ్యులలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

Share