లైట్‌ ఆపలేదని ఎన్టీయార్‌ తన్నారు: వేణుమాధవ్‌!

Telugu

కొన్ని సంవ్సరాల కిత్రం వరకు వరుసబెట్టి సినిమాలు చేసిన కమెడియన్‌ వేణుమాధవ్‌ ఇప్పుడు కాస్త స్లో అయ్యాడు. అనారోగ్య కారణాలతో వెండితెరకు దూరమైన వేణుమాధవ్‌ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నాడు. సినిమాల్లోకి రాకముందు వేణుమాధవ్‌ తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో పనిచేశాడనే విషయం తెలిసిందే. ఆ సందర్భంగా సీనియర్‌ ఎన్టీయార్‌తో జరిగిన ఓ సంఘటన గురించి ఇటీవలి ఓ టీవీ ప్రోగ్రామ్‌లో వెల్లడించాడు వేణుమాధవ్‌. ‘‘సినిమాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో టెలీఫోన్‌ ఆపరేటర్‌గా పనిచేశాను.

Share

జైల్లో ఉన్నా శశికళను నిద్రపోనివ్వట్లేదు!

Telugu

జైలు జీవితం గడుపుతున్న జయలలిత నెచ్చెలి వీకే శశికళకు తమిళనాడు నుంచి కుప్పలు తెప్పలుగా ఉత్తరాలు వచ్చిపడుతున్నాయి. జయలలితను కావాలనే చంపారని శాపనార్థాలు పెడుతూ వచ్చే లేఖలే అందులో ఎక్కువగా ఉన్నాయని పరప్పన అగ్రహారం జైలు వర్గాలు వెల్లడించాయి. జయలలిత అక్రమాస్తుల కేసులో సహనిందితురాలిగా జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు... ఫిబ్రవరి 15 మొదలు ఇప్పటివరకు 100 పైగా లేఖలు వచ్చాయని సమాచారం.

Share

మళ్లీ ఒక్కటి కాబోతున్న సంగీత దిగ్గజాలు

Telugu

తమిళ సినీరంగం తరఫున ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానసభను నిర్వహించేందుకు సన్నాహాలు చేపడుతున్నట్టు నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్‌ తెలిపారు. సన్మానసభ సందర్భంగా ఇళయరాజా నిర్వహించే సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొంటారని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలోని పలు నగరాల్లో ఎస్పీబీ సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు.

Share

‘రెండు ఆకులు’ కాదు... పార్టీ పేరు కూడా మారింది...

Telugu

‘అమ్మ’ జయలలిత వారసత్వం కోసం పోరాడుతున్న శశికళ, పన్నీర్ సెల్వం ఎదురు దెబ్బ తిన్నారు. పార్టీ గుర్తు రెండు ఆకులు ఇరువురిలో ఒకరికైనా లేకుండా పోయింది. అదే విధంగా ఇరు వర్గాలకూ వేర్వేరు పార్టీల పేర్లు వచ్చాయి. అన్నా డీఎంకే ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలకు వేర్వేరు గుర్తులను కేటాయించింది. పార్టీ పేర్లను కూడా మార్చింది.

Share

ఆ సినిమాలే జయసుధ భర్త మృతికి కారణమా !

Telugu

సీనియర్ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారని, ఇందులో అనుమానాస్పద అంశాలేవీ లేవని ముంబై పోలీసులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. ముంబైలోని అంధేరీ వెస్ట్ జేపీ రోడ్‌లో ఉన్న సీ గ్లింప్స్ భవన సముదాయంలోని సోదరి ఇంట్లో ఉంటున్న నితిన్ కపూర్‌, ఆ ఇంటినే తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు నితిన్‌కపూర్‌ ఈ భవనం ఆరో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసుల ప్రకటన స్పష్టం చేసింది.

Share

విమానంలో పేలిన హెడ్‌ఫోన్స్‌

Telugu

విమానంలో హెడ్‌ఫోన్స్‌ పేలిపోవడంతో ఓ మహిళ మొహం కాలిపోయింది. బీజింగ్‌ నుంచి మెల్‌బోర్న్‌ వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఏదో పేలిన శబ్ధం విని మహిళ ఉలిక్కి పడి లేచింది. తీరా చూసేసరికి చెవికున్న హెడ్‌ఫోన్స్‌ నుంచి మంటలు పొగలు వ్యాపిస్తున్నాయి. మొహము, చేతులు నల్లగా కాలిపోయాయి. అప్పటికే హెడ్‌ఫోన్స్‌ కాలిపోవడం గుర్తించి వాటిని తీసి పక్కకు పడేశాను కాబట్టి సరిపోయిందని.. లేకపోతే మెడ మొత్తం కాలిపోయుండేదని మహిళ వాపోయింది. విమాన సిబ్బంది వెంటనే స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.

Share

జయ కొడుకును నేనే!: ఈరోడ్‌ కృష్ణమూర్తి

Telugu

తమిళనాడు మాజీ సీఎం జయలలిత కుమార్తెనంటూ కొద్దిరోజుల క్రితం ఓ యువతి హల్‌చల్‌ చేయగా.. ఇప్పుడు ఆమె కుమారుడిని తానేనంటూ ఈరోడ్‌కు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాడు. తానింత కాలం జయ స్నేహితురాలు వనితామణి ఇంట తన పెంపుడు తల్లిదండ్రులతోపాటు నివసించానని, 2016 సెప్టెంబరు 14న పొయస్‌ గార్డెన్‌కు వెళ్లానని, నాలుగు రోజులపాటు తన తల్లి జయతో అక్కడే ఉన్నానని అందులో పేర్కొన్నాడు.

Share

నేను ఐశ్వర్యను కొట్టలేదు.. కానీ...: లవ్ అఫైర్‌పై సల్మాన్

Telugu

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్‌ల లవ్ అఫైర్ బాలీవుడ్ ప్రపంచం మొత్తానికి ఓపెన్ సీక్రెట్. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమా టైంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారన్నది అందరూ అనుకునే నిజం. అంతేకాదు.. వారిద్దరూ పెళ్లికి కూడా సిద్ధమైపోయారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాతే సీన్ అంతా రివర్స్ అయిపోయింది. సల్మాన్ నుంచి ఐశ్వర్య దూరమై పోయింది. సల్మాన్ శాడిజం తట్టుకోలేకే అతడి నుంచి విడిపోయిందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

Share

సమంత దృష్టి ఇక ‘కాటమరాయుడు’పై?

Telugu

స్టార్‌ హీరోయిన్‌ సమంత సినిమాలు చేస్తూనే, మరోపక్క సేవా కార్యక్రమాలపైనా దృష్టి పెడుతుంది. ‘ప్రత్యూష ఫౌండేషన్‌’ను నడుపుతున్న సమంత వీలు కుదిరినపుడు ఓ మంచి పని కోసం హీరోలు సినిమాల్లో ధరించిన దుస్తులను, వస్తువులను వేలం వేసి డబ్బులు సంపాదిస్తుంది. అలా వచ్చిన డబ్బును మంచి పనులకు కేటాయిస్తుంది. గతంలో పవన్‌, మహేష్‌, ఎన్టీయార్‌ల దుస్తులు వేలం వేసి ఆ డబ్బును కొన్ని స్వచ్ఛంద సంస్థలకు అందించింది. ఇప్పుడు ‘కాటమరాయుడు’ సినిమాలో పవన్‌ ధరించిన దుస్తులను వేలం వేయాలనే ఆలోచనలో ఉందట సమంత.

Share

కాజల్ ఆప్యాయంగా పట్టుకున్న ఆ రాజకీయ నాయకుడెవరు?

Telugu

కాజల్ అగర్వాల్ ఆప్యాయంగా ఓ వ్యక్తిని ఇంకా చెప్పాలంటే ఓ రాజకీయ నాయకుడిని కౌగిలించుకుని ఉంది. పెళ్లికూతురుగా ముస్తాబైన కాజల్.. ఆ ఫొటోను ఈ రోజు ఉదయం తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కమింగ్ సూన్ అంటూ పోస్ట్ పెట్టింది. ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరు? రీసెంట్‌గా ఘాజీతో సక్సెస్ అందుకున్న రానా దగ్గుబాటి.. ప్రస్తుతం తేజ డైరెక్షన్‌లో ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అందులో రానా రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

Share