రూ.10 నాణేలు తీసుకోవటంలేదా అయితే ఈ విధంగా చేయండి

Telugu

రూ.10 నాణేలు తీసుకొనేందుకు నిరాకరించిన ఓ బ్యాంకు అధికారిపై ఖాతాదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవలి కాలంలో రూ.10 నాణేలు చెల్లవంటూ వదంతులు ఊపందుకున్నాయి. దీనిపై స్పందించిన రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.10 నాణేలు తీసుకోవాలని, లేదంటే చట్టపరంగా చర్యలు చేపడతామని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోయంబత్తూర్‌ టౌన్‌హాల్‌ ప్రాంతానికి చెందిన బంగారం వ్యాపారి రాజన్ గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రూ.2 వేల విలువైన రూ.10 నాణేలు ఓ ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు వెళ్లాడు.

Share

ధోనీ గురించి చేదు వార్త ! అదేమిటో మీరు చూడండి.....

Telugu

మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు చెబితే క్రికెట్ అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ధోనీ బ్యాట్ పట్టుకుని క్రీజులోకి రాగానే అభిమానుల కళ్లన్నీ అతడిపైనే ఉంటాయి. కెప్టెన్ కూల్‌గా పేరున్న ధోనీ ఇటీవల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ వార్తే క్రీడాభిమానులను ఎంతో నిరాశకు గురిచేసింది. మరి ధోనీ ఏకంగా క్రికెట్‌కే దూరమైపోతే. ఇంటర్నేష్నల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని మహీ ప్రకటిస్తే!!.. ఇంకేమైనా ఉందా?.. ధోనీ అభిమానుల హార్ట్ బ్రేక్ అయిపోదూ!

Share

భారీగా తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు! అదిఎంత కాలమో !

Telugu

చాలా రోజుల తర్వాత పెట్రోల్‌ ధరలు తగ్గాయి. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3.77 తగ్గగా, డీజిల్‌పై రూ.2.91 తగ్గింది. తగ్గిన ధరల మేరకు స్థానిక పన్నుల భారం కూడా తగ్గడంతో ఆయా ప్రాంతాల్లో నికర తగ్గుదల మరింత ఉంటుంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ మీద రూ.5.10 తగ్గగా, డీజిల్‌పై రూ.3.68 తగ్గింది. నగరంలో తాజారేట్లు పెట్రోల్‌ లీటర్‌కు రూ.70.81 ఉండగా, డీజిల్‌ రూ.60.66గా ఉంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి మారిన ధరలు అమల్లోకి వచ్చాయి.

Share

దుమారం రేపుతున్న సంగీత దర్శకుడి మాటలు!

Telugu

‘బాహుబలి’ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించి అందరి చేతా మన్ననలు పొందిన సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి. అయితే ‘బాహుబలి-2’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు కొద్ది గంటల ముందు ఆయన చేసిన ట్వీట్లు విమర్శల పాలవుతున్నాయి. తెలుగులో బుర్ర తక్కువ దర్శకులు ఎక్కువని వ్యాఖ్యానించిన కీరవాణి.. తెలుగు గీత రచయితలపైనా తీవ్ర విమర్శలు చేశాడు. ‘వేటూరి సుందరరామ్మూర్తి చనిపోయిన తర్వాత, సిరివెన్నెల సీతారామశాస్ర్తి పాటలు రాయడం తగ్గించిన తర్వాత తెలుగు పాట అంపశయ్య ఎక్కింది’ అని కీరవాణి విమర్శించాడు.

Share

పవన్‌ కొత్త సినిమాలో విలన్ ఎవరో మీకు తెలుసా!

Telugu

పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాపై ప్రస్తుతం డివైడ్ టాక్ నడుస్తోంది. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. వెంటనే తదుపరి సినిమాలో జాయిన్ కాబోతున్నాడు పవర్ స్టార్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నాడు. ఏప్రిల్ 6 నుంచి సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. గత జూన్ నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు సంబంధించి స్టార్ కాస్ట్ ఇంకా ఏదీ తేలకపోయినా.. ఓ ఆసక్తికరమైన అంశం ఫిల్మ్‌నగర్‌లో హల్ చల్ చేస్తోంది.

Share

ఖాతాదారులు బ్యాంకులోనే డబ్బు ఉంచేందుకు బ్యాంకుల సరికొత్త వ్యూహరచన!!

Telugu

క్రెడిట్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు ఉచిత క్రెడిట్ కార్డులు అందిస్తామని, ఖాతాలో రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు నిల్వ ఉంచుతున్న వినియోగదారులు ఈ ఉచిత క్రెడిట్ కార్డులను పొందొచ్చని, నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా వాడుకోవచ్చని ఎస్‌బీఐ చీఫ్ తెలిపారు. డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ‘ఉన్నతి’ అనే పథకం ద్వారా ఈ ఉచిత క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు.

Share

నానికి జీవితంలో ప్రమోషన్ వచ్చింది....అదేమిటో మీరు తెలుసుకోండి

Telugu

హీరో  నానికి తండ్రిగా ప్రమోషన్ వచ్చేసింది. ఉగాది పర్వదినాన్నే నాని భార్య అంజనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. 2012లో అంజనను నాని ప్రేమ వివాహం చేసుకున్నాడు. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో సినిమాల్లో దూసుకుపోతున్న నానికి ఇంతకంటే మంచి న్యూస్ ఏముంటుంది. మరి, తండ్రి అయిన నానికి మనమూ శుభాకాంక్షలు చెబుదామా!

Share

‘కాటమరాయుడు’లో శృతి అందంపై విమర్శలు!

Telugu

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోనికి వచ్చేసింది. పాజిటివ్‌ రివ్వ్యూలతో హిట్‌ టాక్‌ సాధించిన ఈ సినిమా పవన్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఎప్పుడూ యూత్‌ లుక్‌తో దర్శనమిచ్చే పవన్‌.. ఈ సాదాసీదా లుక్‌లో కూడా అందంగా ఉన్నాడని అందరూ అంటున్నారు. అయితే ఈ సినిమా శృతీహాసన్‌కు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చిందనే టాక్‌ వినబడుతోంది. ఈ సినిమాలో శృతీహాసన్‌ ఏమాత్రం అందంగా లేదనే విమర్శలు వస్తున్నాయి.

Share

నాగలాపురంలో మూలవిరాట్‌ను తాకిన సూర్య కిరణాలు

Telugu

చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేదనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు గురువారం తాకాయి. ఈ సుందర దృశ్యాన్ని తిలకించి భక్తజనం పులకించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. శుక్రవారం నుంచి సూర్యపూజ మహోత్సవాలు ప్రారంభం కానుండగా ఈ నేపధ్యంలో ముందస్తుగా గురువారం సాయంత్రం 6.10 గంటలకు సూర్యకిరణాలు ఆలయ రాజగోపురం నుంచి మెలమెల్లగా లోపలికి చొచ్చుకొని స్వామి మూల విరాట్‌ను తాకాయి.

Share

ఆ రెండో పాత్రలో... నటించడం కష్టం

Telugu

నాలుగేళ్లకు పైగా ఒకే సినిమా కోసం పనిచేయడమంటే అంత ఈజీ కాదు. అదీ.. ఓ స్టార్‌ హీరోకు! ‘బాహుబలి’ కోసం ప్రభాస్‌ నాలుగేళ్ల పాటు మరో సినిమా చేయకుండా దానికే అంకితమైపోయారు. ‘బాహుబలి’ పాత్ర చేయడంలో ఆయన బాగా అలసిపోయారు. ‘ఇక చాలు’ అని కూడా ఒకానొక క్షణంలో అనుకున్నారు. ‘‘కానీ షూటింగ్‌ పూర్తయ్యాక మాత్రం ‘అరే.. ‘బాహుబలి’ ప్రాజెక్ట్‌ అయిపోయిందా? మళ్లీ ఇలాంటి చేస్తానో.. లేదో..’ అనిపించింది. ఈ సినిమా నా భవిష్యత్తును ఎటు తీసుకుపోతుందో తెలీదు.

Share