నయన్‌ ఇకముందు బాలీవుడ్ లో నటించనుందా!

Telugu

దక్షిణాదిన అమ్మడి క్రేజ్ చూసి మురిసిపోయిన ఆ బాలీవుడ్ బిగ్ షాట్.. ఉన్నట్లుండి ఆమెకు ఎర్ర తివాచీ పరిచేసి మరీ ఆహ్వానం పలుకుతున్నాడట. ఇంతకూ ఇంత గౌవరం అందుకున్న ఆ సుందరాంగి ఎవరంటే.. నయనతార. టోటల్ సౌత్ ఇండస్ట్రీకే లేడీ సూపర్ స్టార్‌గా జెండా ఎగరేస్తున్న అందాల తార నయనతార.. ప్రస్తుతం కోలీవుడ్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తోందన్న సంగతి తెలిసిందే.

Share

ట్రంప్‌ బాటలో సింగపూర్‌

Telugu

సింగపూర్‌ కూడా అమెరికా బాట పట్టింది. తమ దేశంలో పని చేసే భారత ఐటి కంపెనీలు స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. ఇందుకోసం భారత ఐటి నిపుణులకు వీసాలు ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. గడువు ముగిసిన వీసాలు పొడిగించేందుకూ ససేమిరా అంటోంది. ‘‘కొత్త వీసాల జారీ దాదాపుగా ఆపేశారు. ఉన్న వీసా గడువు ముగియడంతోనే ఆ దేశం నుంచి బయట పడాలి. దీంతో అవసరమైనంత సంఖ్యలో ఉద్యోగులను ఉంచలేకపోతున్నాం’ అన్నారు నాస్కామ్‌ జాతీయ అధ్యక్షుడు ఆర్‌ చంద్రశేఖర్‌.

Share

మరో వివాదంలో ధనుష్‌... వకాల్తాలో ఫోర్జరీ సంతకం

Telugu

తమిళ నటుడు ధనుష్‌ ఎవరి కుమారుడో నిర్ధారించాలని దాఖలైన కేసు విచారణ ముగియకముందే, వకాల్తాలో ఫోర్జరీ సంతకం చేసినట్లు ఆయనపై మరో ఆరోపణ నమోదైంది. వకాల్తా పత్రాల్లో ఆయన ఫోర్జరీ సంతకానికి పాల్పడ్డారంటూ న్యాయవాది న్యాయస్థానానికి ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. మదురై జిల్లా మేలూరు సమీపంలో మలంపట్టి గ్రామానికి చెందిన కదిరేశన, మీనాక్షి దంపతులు ధనుష్‌ తమ కుమారుడేనని, అతని నుంచి తమకు జీవనభృతి ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ మేలూరు కోర్టులో గత డిసెంబర్‌లో పిటీషన దాఖలు చేశారు.

Share

హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు !

Telugu

సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ సంస్కృతి చాలా ఎక్కువని, అవకాశాల కోసం లొంగిపోక తప్పదని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అర్చన, మాధవీలత, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, కస్తూరి, రాధికా ఆప్టే వంటి హీరోయిన్లు ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించిన సంగతీ తెలిసిందే. తాజాగా మలయాళ నటి పార్వతి మీనన్ కూడా తనకు ఎదురైన అనుభవాల గురించి నోరు విప్పింది.

Share

ఈ బస్సులో ఎక్కడికెళ్లినా రూపాయే చార్జీ!

Telugu

దక్షిణాసియాలోనే తొలిసారిగా బయో-గ్యాస్ ఇంధనంగా నడిచే బస్సును ఆవిష్కరించనున్నట్టు కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ ప్రకటించింది. ‘‘ఇటువంటి బస్సును ఆవిష్కరించడం ఆగ్నేయాసియాలోనే ఇది తొలిసారి. ఇప్పుడు 15-20 ఏళ్ల నాటి బస్సులకు కూడా ఈ చవకైన, పరిశుభ్రమైన ఇంధనంతో కొత్త జీవితాన్ని ఇస్తాం. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం’’ అని ఫోనిక్స్ ఇండియా రీసెర్చ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి ప్రకాశ్‌దాస్ తెలిపారు.

Share

రిలయన్స్‌ జియో మరో సంచలనం?

Telugu

రిలయన్స్‌ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. త్వరలో ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ టెలివిజన్‌ (ఐపి టీవీ) ప్రసారాలు ప్రారంభించబోతోందని తెలుస్తోంది. దీనిపై కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇటీవల ఆన్‌లైన్‌లో లీకైన సెట్‌టాప్‌ బాక్స్‌ను చూస్తే జియో త్వరలో ఐపిటీవీ సేవల రంగంలోకి ప్రవేశిస్తుందన్న ప్రచారం సాగుతోంది.

Share

ఫోన్ చార్జింగ్ ఈ విధంగా పెట్టారంటే ఇంక అంతేసంగతులు.......అలా పెట్టొద్దు ప్లీజ్!

Telugu

బెడ్రూంలో ఫోన్ చార్జింగ్ పెట్టుకుని పడుకున్న పాపానికి 32 యేళ్ల ఓ యువకుడు తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఒళ్లంతా కాలిన గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అమెరికాలోని హంట్స్‌విల్లేకి చెందిన విలే డే అనే యువకుడు.. ఇటీవల తన బెడ్ మీదనే ఐఫోన్‌కి చార్జింగ్ పెట్టి పడుకున్నాడు. గాఢ నిద్రలో ఉండగా అతడి మెడలోని నెక్లెస్ ఐఫోన్ చార్జర్ వైరుకు తగలడంతో విద్యుత్ ప్రసారం మొదలైంది.

Share

ఉగ్రవాదం కంటే ప్రేమే చంపుతోంది

Telugu

ఇదివరకు ప్రేమ అంటే రెండు అక్షరాల పదం రెండు హృదయాలను కలిపే భావం అని చెప్పేవారుకానీ అదే ప్రేమ ఉగ్రవాదం కంటే భయంకరమైనదని తెలుసా? ఇది అక్షరాలా నిజం. భారతదేశంలో ఉగ్రదాడుల్లో మరణిస్తున్న వారి కంటే ప్రేమ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యే ఎక్కువ. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం.. 2001 నుంచి 2015 వరకు ప్రేమ కారణంగా 38,585 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి.

Share

అలియానే కావాలంటున్న అఖిల్!

Telugu

ఏ ముహూర్తాన అఖిల్ హీరోగా కెరీర్ ప్రారంభించాడో కానీ.. అతడి రెండో సినిమా ఇప్పటికీ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఏడాదిన్నర దాటిపోయిందిగానీ.. రెండో సినిమా ఏంటన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. స్టార్‌గా అతడి కెరీర్ గాడిలో పడేందుకు మాత్రం అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ముందే ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్.. తన ఫస్ట్ సినిమా అఖిల్‌తో మెప్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. అఖిల్ ఆ రేంజ్‌లో డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు మరి.

Share

మరో టైటిల్ ను తనఖాతాలో వేసుకున్న పీవీ సింధు

Telugu

తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచిన సింధు ఇప్పుడు ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌లో విజేతగా నిలిచింది.ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ 2017 ఫైనల్ మ్యాచ్‌లో తెలుగు తేజం పీవీ సింధూ ఘన విజయం సాధించింది. తన కెరీర్‌లో తొలి ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచింది. సింధూ కెరీర్‌లో ఇది రెండో సూపర్ సిరీస్ టైటిల్ కాగా ఓవరాల్‌గా తొమ్మిదొవ టైటిల్.

Share