జయలలితే తల్లి అంటున్న అమృత

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణించి 9 నెలలు కావస్తోంది! ఇప్పుడు... ‘నేను ఆమె బిడ్డనే’ అంటూ అమృత అనే యువతి తెరపైకి వచ్చారు. ఎన్నో సందేహాలను, మరెన్నో అనుమానాలను రేపారు. ఇప్పటికే జయ రాజకీయ వారసత్వం, ఆస్తుల వారసత్వంపై పార్టీలో, ప్రభుత్వంలో, బంధువుల్లో రచ్చ జరుగుతోంది. ఇది చాలదన్నట్లుగా ‘అమ్మే’ మా అమ్మ అంటూ తెరపైకి వచ్చిన అమృత వివాదాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అన్నాడీఎంకే నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. డీఎన్‌ఏ పరీక్షకు సైతం సిద్ధమని అమృత చేసిన ప్రకటన వారిని వణికిస్తోంది. అమృత చెప్పేది అబద్ధమంటూ ఆమెను ఢీకొట్టాలా, తమలో కలుపుకోవాలా.. ఈ విషయాన్ని ‘విస్మరించి’ వదిలేయాలా అన్నదానిపై ఒకటీ రెండు రోజుల్లో సీఎం ఎడప్పాడి నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఆది నుంచే రకరకాల ఆరోపణలు..

దక్షిణ భారత సినీ పరిశ్రమలో తారాజువ్వలా వెలిగిన జయ, తెలుగులో అందాల నటుడిగా పేరుగాంచిన శోభన్‌బాబు సన్నిహితంగా ఉండే వారని గుసగుసలు ఉన్నాయి. వారిద్దరికీ ఓ ఆడపిల్ల కూడా పుట్టిందని, ఆమె హైదరాబాద్‌లోనో, మరెక్కడో జీవిస్తోందన్న వదంతులూ ఉన్నాయి. జయ, శోభన్‌బాబు సన్నిహితంగా ఉన్న ఫోటోలను 2010లో డీఎంకే బయటపెట్టింది. జయ దీనిపై నోరు మెదపలేదు. వారిద్దరి ప్రేమ ఫలితంగానే తాను జన్మించాననేది అమృత మాట.

ఎవరీ అమృత?

అమృత ప్రస్తుతం బెంగళూరు శివారు ప్రాంతం కెంగేరిలో నివసిస్తున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆమె ఓ ప్రైవేటు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1996లో తాను జయను మొదటిసారిగా కలుసుకున్నట్లు ఇటీవల ప్రధానికి రాసిన లేఖలో అమృత వెల్లడించారు. దానిని పోయెస్‌ గార్డెన్‌ వర్గాలూ ధ్రువీకరించాయి. 1996-98 ప్రాంతంలో జయ అధికారం కోల్పోయి పలుకేసుల్లో ఇరుకున్నపుడు అమృత వచ్చిన మాట వాస్తవమేనని పేర్కొన్నాయి. కొన్ని రోజుల పాటు ఆమె పోయెస్‌ గార్డెన్‌లో ఉన్నారని అన్నాడీఎంకే సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఒక టీ రెండుమార్లు మాత్రమే పోయెస్‌ గార్డెన్‌కు వచ్చారని తెలిపారు.

జయ మరణం తర్వాత అమృ త కొన్ని కన్నడ, తమిళ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ‘‘కుటుంబం గురించి బయటి ప్రపంచానికి తెలియడం జయలలితకు ఇష్టం ఉండదు. ఆమెతో ఎంత దగ్గరి బంధుత్వమున్నా బయటకు చెప్పుకోలేని దీనస్థితి మాది’’ అని అమృత వాపోయారు. అయితే, జయలలిత తనకు పెద్దమ్మ అని మాత్రమే అప్పట్లో చెప్పారు. కాగా అమృత అమెరికాలో జన్మించినట్లుగా ఆమె జన్మ ధ్రువీకరణ పత్రాల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జయలలితకు వరుసకు సోదరి అయ్యే శైలజ దంపతుల కుమార్తెగా ఆమె పెరిగారు.

దించాలో తెలియడం లేదని సీఎం సన్నిహితుడొకరు వ్యాఖ్యానించారు. వారసత్వ పోరాటం ఎలాగున్నా ఈ వ్యవహారం జయ జీవితానికి మచ్చ తెచ్చిపెట్టేలా ఉందని, అందువల్ల ఇది పెద్దది కాకుండా చూడడమే తమ కర్తవ్యమన్నారు. జయ ఆస్తుల కోసం రోడ్డెక్కిన ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌ కూడా అమృత ప్రకటన పట్ల మౌనం దాల్చడం పలు అనుమానాలకు దారి తీస్తోంది

Share