బాలయ్యపై కీరవాణి ట్వీట్.. కొత్త వివాదం !

బాహుబలి-2’ విడుదలకు ముందు తెలుగు సినిమా పాటల్లో సాహిత్య విలువలు పడిపోవడం పట్ల కీరవాణి ట్విట్టర్లో చేసిన కామెంట్స్ విమర్శలకు దారి తీశాయి. తాజాగా ఈ సంగీత మరకతమణి చేసిన మరో ట్వీట్ కూడా వివాదానికి కారణమైంది. ‘జై హింద్’ స్లోగన్‌తో ‘జై బాలయ్య’ను పోల్చటంతో కొంతమంది నెటిజన్ల కోపానికి గురయ్యారు కీరవాణి. బాలకృష్ణ 'పైసా వసూల్' ఫస్ట్ డే సందర్భంగా థియేటర్లో బాలయ్య అభిమానుల కోలాహాలం చూసిన కీరవాణి.. ‘జైహింద్’ అనేటపుడు ఎంత ఎమోషన్ ఉంటుంటో.. ‘జై బాలయ్యా’ అనడంలోనూ అంతే ఎమోషన్ కనిపిస్తోందన్నట్లు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే వివాదానికి కారణమైంది.

 దేశభక్తికి సంబంధించిన ‘జైహింద్’ నినాదంతో ‘జై బాలయ్య’ స్లోగన్‌ను ఎలా పోలుస్తారంటూ కీరవాణిపై నెటిజన్లు విరుచుకు పడ్డారు. కొంతమంది అయితే ఏకంగా కీరవాణికి ఈ విషయంలో కులం మకిలి కూడా అంటించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు కీరవాణి. తన దేశభక్తిని ఎవరూ శంకించలేరని.. ఫేక్ డీపీలు పెట్టుకునే కుక్కలు తన దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరమని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అంతే కాకుండా.. తను బాలయ్యను మాత్రమే కాదు.. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కాస్ట్ అండ్ క్రూను కూడా పొగిడానని, మరి వాళ్ల కులాలేంటి? అని ప్రశ్నించారు కీరవాణి. సో ఇకపై సెలబ్రిటీలు ట్వీట్ చేసేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలంటున్నారు

Share