పవన్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆయన 25వ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శనివారం (సెప్టెంబరు 2) పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. 

కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ బాణీలు అందిస్తున్నారు. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రమిది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

పవన్‌ 25వ చిత్రం టైటిల్స్‌గా చాలా పేర్లు వినిపించాయి. ‘ఇంజినీరు బాబు’, ‘గోకుల కృష్ణుడు’, ‘దేవుడు దిగివచ్చిన వేళ’, ‘రాజు వచ్చినాడు’ పేర్లు బయటికి వచ్చాయి. మరి అసలు టైటిల్‌ ఏదో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

MovieImage: 
Share