పక్కా ప్లాఫ్ అనుకున్నా.. శాతకర్ణిపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

Telugu

రాజమౌళి.. బాహుబలితో తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని ప్రపంచానికి తెలియజేసిన దర్శకధీరుడు. క్రిష్.. విభిన్న కథాంశాలతో సినిమాలు తీస్తూ.. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేస్తున్న దర్శకుడు. వీరిద్దరూ ఒక్క చోట చేరితే.. సరదాగా మాట్లాడుకుంటే.. సినీ అభిమానులకు కనువిందే. ప్రేక్షకులను రంజింపజేసేందుకేమో. వీరిద్దరూ ఒక్కచోట చేరారు. శాతకర్ణి విజయంపై క్రిష్‌ను రాజమౌళి స్వయంగా ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి ‘శాతకర్ణి’ సినిమాపై తన అభిప్రాయాలను కుండబద్ధలుకొట్టినట్లు చెప్పారు. 

Share

భారీ ఆఫర్లు పట్టేస్తున్న టి.వి యాంకర్లు!!!

Telugu

మొన్నటికి మొన్న అనసూయ, రేష్మి  వెండితెర మీద నటించే ఛాన్స్ కొట్టేశారు. అనసూయ పెద్ద సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తుంటే, రేష్మి చిన్న సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ బాటలోనే శ్రీముఖి అడుగులు వేస్తుంది. మొన్నామధ్య అల్లుఅర్జున్ సినిమాలో అవకాశాన్ని కొంచెంలో పోగొట్టుకుని కొంచెం భాదపడింది. వెండితెరపై అప్పుడప్పుడు పలు సినిమాలలో నటించినా మంచి గుర్తింపు రాలేదు ఈ అమ్మడికి. అలాంటిది శ్రీముఖి హీరోయిన్ అవకాశం దక్కించుకుంది అనే పుకార్లు చెక్కర్లు కొడుతున్నాయి.

Share

మోక్షఙ్ఞ సినీరంగ ప్రవేశంపై బాలయ్య క్లారిటీ

Telugu

మోక్షఙ్ఞ సినీరంగ ప్రవేశంపై అందరి ఉహాగానాలకు ముగింపు పలికిన బాలయ్య. మోక్షఙ్ఞ మొదటి సినిమా ఈ సంవత్సరం చివరిలో ఉంటుందని తేల్చి చెప్పాడు. అంతేకాకుండా మోక్షఙ్ఞతో బాలకృష్ణ సినిమా చేయనున్నట్లు చెప్పారు. ఆదిత్య 369 కి సీక్వెల్ 'ఆదిత్య 999 తీయబోతున్నట్లు దానిలో తామిద్దరూ నటిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బాలయ్య శాతకర్ణి విజయపధంలో పరిగెడుతుంది.

Share

కోడిగుడ్డును ఎన్ని నిమిషాలు ఉడికించాలంటే..?

Telugu

కోడిగుడ్డును ఎన్ని నిమిషాలు ఉడికించాలంటే..?
ఒక కోడిగుడ్డు ఉడికేందుకు మ‌హా అయితే ఎంత స‌మ‌యం ప‌డుతుంది..? 10 లేదా 15 నిమిషాలు… అదీ.. మనం పెట్టే మంట‌ను బ‌ట్టి కూడా ఉంటుంది. కానీ అస‌లు గుడ్డును స‌రిగ్గా ఎన్ని నిమిషాల పాటు ఉడికించి తింటే మంచిదో తెలుసా..? ఇదే విష‌యంపై జె. కెంజీ లోపెజ్-ఆల్ట్ అనే ఓ అమెరిక‌న్ చెఫ్ ప్ర‌యోగం చేశారు. ఆయ‌న ఏం చెబుతున్నారంటే…

Share

మహేష్‌ తన ట్వీట్స్‌తో అందరినీ ఆశ్చర్య పరిచాడు

Telugu

తమిళనాడులో జల్లికట్టు వ్యవహారంపై నిరసనలు బాగా వెల్లువెత్తుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు, విద్యార్ధి సంఘాలు ఈ ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేవరకు తమ ఆందోళనలు విరమించేది లేదని విద్యార్థులు, యువతీయువకులు మెరీనా బీచ్ నుంచి కదలే ప్రసక్తే లేదని తెలియజేశారు. రాష్ట్ర  వ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు కొన్నాళ్లు హడావుడి చేసి మానుకునేలా కనిపించడం లేదు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు తాజాగా తమిళులు జల్లికట్టుపై చూపిస్తున్న సంఘీబావాన్ని ప్రశంసించారు.

Share

ట్రంప్ అంటే భయంలేదంటున్న--- ప్రియాంక

Telugu

ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా తనసత్తా చాటుతున్న బాలీవుడ్ నటి. అమెరికా టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’లో అలెక్స్‌ ప్యారిస్‌ పాత్రతో అక్కడి వారి అభిమానాన్ని చూరగొంది. అలెక్స్‌ ప్యారిస్‌ పాత్రకు గాను వరుసగా రెండోసారి పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోంది. ట్రంప్ కి వ్యతిరేకంగా అమెరికాలో చాలామంది నోటినుంచి నిరసన వ్యాఖ్యలు వినబడుతున్నాయి ముఖ్యంగా సినిమా తారలైతే ట్రంప్‌ను బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

Share

ఈ క్షణం జీవించడం ఎలా?

Telugu

జీవితం గురించి అతిగా, అనవసరంగా ఆలోచించడం వ్యర్ధం. అది వుంది. దాన్ని గురించి ఆలోచించడమెందుకు? అసలు ఆలోచన అన్నది విషంతో సమానమయింది. జీవితమన్నది జీవించడానికి, ఆలోచించడానికి కాదు. అన్నం తినడానికి ఆలోచిస్తామా? గాలి పీల్చడానికి ఆలోచిస్తామా? చూడడానికి ఆలోచిస్తామా? అలాగే జీవితం దానంతట అది సాగనీ. అది సాగుతుంది. దాని గురించి ఆలోచించడమెందుకు? ఆరాటమెందుకు? ఆలోచన అన్నది గతానికో, భవిష్యత్తుకో సంబంధించి ఉంటుంది, వర్తమానానికి కాదు. ఈ క్షణంలో మనిషి బతకాలి, రేపుకాదు, నిన్న జీవించలేం, రేపు జీవిస్తామోలేదో తెలీదు. ఇప్పుడు ఇక్కడ బతకాలి.

Share

సత్యపథం

Telugu

తెలివి, జ్ఞానం, మోహరాహిత్యం, ఓర్పు, సత్యము, మనోనిగ్రహం, సుఖదుఃఖాలు, ఉండడము లేకపోవడం, భయభయాలు అన్ని నావలననే కలుగుతాయి.

సర్వత్రా సంచరించే ప్రచండ వాయువు ఎలాగైతే ఆకాశంలోనే ఉంటుందో అలాగే అన్ని ప్రాణులు నాలోనే వున్నాయి.

నీ పని నీవు చక్కగా చేసుకుంటూ పో.... ఫలితాన్ని మాత్రం నాకు వదిలిపెట్టు!!!

Share

నోట్ల వర్షం కురిపిస్తున్న ఏటీఎం

Telugu

నోట్లు రద్దైన తరువాత ప్రజలు కొత్త నోట్ల కోసం నిన్న మొన్నటిదాకా నానా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం కొత్త నోట్ల కొరత కొంత తీరినా కొన్ని చోట్ల అవస్థలు పడుతున్నారు. కాని రాజస్థాన్‌లోని టోంక్‌లో మాత్రం అరుదైన ఘటన జరిగింది. ఈ ఏటీఎం లో 100 నోట్లకు బదులు 2000 నోట్లు వస్తున్నాయి. దివాకర్ అనే వ్యక్తి 3500 రూపాయలు డ్రా చేయడానికి ఏటీఎం మెషిన్‌లో టైప్ చేశాడు. అయితే ఆ ఏటీఎం నుంచి అనూహ్యంగా డబ్బు బయటికొచ్చింది. వస్తూనే ఉంది.

Share